హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే బొప్పూడిలో రాష్ట్ర గవర్నర్ పర్యటన

PLD: చిలకలూరిపేట(M) బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.10.99 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం ఉదయం 11:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం తదితర పనులు ఇందులో ఉన్నాయి.