హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28న పాలగిరిలో పౌర్ణమి వేడుకలు

KDP: VN పల్లె మండలం పాలగిరి క్రాస్‌ వద్ద వెలసిన సాయిబాబా, కాశీనాయన స్వామి ఆలయాలతో పాటు సంఘాలపల్లె శ్రీ శివకృష్ణ గోశాలలో ఈనెల 28న పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.