హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పల్లె నిద్రలో మాదకద్రవ్యాలపై అవగాహన'

VZM: బాడంగి SI సూర్యకుమారి నిన్న రాత్రి స్దానిక పినపెంకి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సైబర్‌ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచించారు.