NTR: ఈజీగా లోన్ వస్తుందని నమ్మి గుర్తుతెలియని లోన్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని వీరులపాడు ఎస్సై అభిమన్యు నాయక్ సూచించారు. యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే భయపడకుండా, వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్సై


