కృష్ణా: పేదల కష్టకాలంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.9.30 లక్షల విలువైన LOC పత్రాలను 7గురు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబ్బు లేక పేదలకు వైద్యం ఆగకూడదన్నదే కూటమి ఉద్దేశమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


