హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండలం ఎన్.రంగాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త కొప్పెల సురేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, టీడీపీ సభ్యత్వం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఈ సందర్భంగా ఆ పత్రాలను ఆయన కుటుంబ సభ్యులకు బుధవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అందజేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని కోట్ల తెలిపారు.