KRNL: ఆదోని పట్టణంలో రజక కుల గురువు శ్రీ మడియాల మాచర్ల స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ, బీజేపీ సీనియర్ నేత బిడ్డ రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రజకుల ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణమ్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రజకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: కృష్ణమ్మ


