హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంభగిరిలో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక

KDP: అట్లూరు మండలం కుంభగిరిలో TDP యువ నాయకుడు రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కడప DCCB ఛైర్మన్, బద్వేల్ TDP ఇన్‌చార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవం కల్పించి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.