TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వార్తలు
పిడుగులతో కూడిన భారీ వర్షాలు


