హైదరాబాద్: 28°C
వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో కొత్త చట్టం

నిరసనలు, అల్లర్ల సమయంలో పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై పశ్చిమ బెంగాల్ సర్కార్ కఠిన చర్యలకు సిద్ధమైంది. 'ప్రాంతీయ శాంతిభద్రతల సవరణ చట్టం-2026'ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తే జరిగిన నష్టానికి 3 రెట్ల పరిహారంతో పాటు వడ్డీ వసూలు చేస్తారు. చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తారు.