హైదరాబాద్: 28°C
వార్తలు

వింత వివాదం: గేదె కోసం DNA టెస్ట్

బిహార్‌లోని గయాలో ఓ గేదె కోసం రెండు వర్గాల మధ్య వివాదం ముదిరింది. తప్పిపోయిన గేదె తమదే అంటూ రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరి గందరగోళం ఏర్పడింది. దీంతో స్పందించిన ఐజీ.. అసలు యజమానిని తేల్చేందుకు ఆ గేదె సంతతితో DNA పరీక్ష నిర్వహించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.