హైదరాబాద్: 28°C
వార్తలు

జైపూర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన డీసీపీ

MNCL: మంచిర్యాల DCP భాస్కర్ జైపూర్ పోలీస్ స్టేషన్ ను బుధవారం పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.