హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు అండగా ఉంటాం: సద్గురు

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది గల్లంతైనట్లు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు ధృవీకరించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 160 మంది సభ్యులు కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ వరదల్లో చిక్కుకున్నారు. వీరిలో 83 మందిని రక్షించగా, 77 మంది గల్లంతయ్యారు.