హైదరాబాద్: 28°C
వార్తలు

'నాబార్డ్ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

ADB: నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు నాబార్డ్ వాటర్ షెడ్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీఓ పుల్లారావు తెలిపారు. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా రానున్నారని సూచించారు. ఈ సందర్బంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.