హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

దేశంలోని హై-డెన్సిటీ రైల్వే నెట్‌వర్క్‌ను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 7 ప్రధాన మార్గాల గుండా సుమారు 11,000 కిలోమీటర్ల పొడవునా ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉందని చెప్పారు. ఢిల్లీ-హౌరా, హౌరా-చెన్నై, చెన్నై-ముంబై, ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ముంబై-హౌరా, ఢిల్లీ-గువాహటి మార్గాలు ఈ హై-డెన్సిటీలో ఉన్నాయి.