హైదరాబాద్: 28°C
వార్తలు

గంగా నదిలో పడవ బోల్తా

బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. నదీ తీరంలో వరద కోత నివారణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కార్మికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గల్లంతయ్యారు. పడవలు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది.