భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నేపాల్‌కు ఈ కష్టసమయంలో భారత్ పూర్తి అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గల్లంతైన 105 మంది భారతీయ పర్యాటకులను సురక్షితంగా రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ చూపిన చొరవకు నేపాల్ ప్రధాని బాలెన్ షా కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులందరినీ సురక్షితంగా తరలిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
నేపాల్‌కు అండగా ఉంటాం: ప్రధాని మోదీ


