JGL: క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్ అన్నారు. మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బుధవారం రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ సుదవేని మురళీగౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆశా కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి: వాసం ప్రసాద్


