ADB: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ బందోబస్తును ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు సామరస్యంతో పండుగ జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
తెలంగాణ
మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


