హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్సేన్ సాగర్‌లో దూకిన సుడాన్ దేశస్థుడు

HYD: హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుడాన్ దేశస్థుడిని సైఫాబాద్ పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. సచివాలయం సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులు గమనించి, తాడు సాయంతో అతడిని నీటి నుంచి బయటకు తీశారు. టోలిచౌకి పారామౌంట్ కాలనీలో ఉంటున్న నాజర్ ఆడమ్ బడా వేగా అనే ఈ విదేశీయుడిని లేక్ పోలీసులకు అప్పగించి, ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.