హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అలవెన్సులపై ఆదాయపన్ను రద్దు చేయాలి'

MNCL: సింగరేణిలో కార్మికుల అలవెన్సులపై విధిస్తున్న ఆదాయపన్ను రద్దు చేయాలని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కోలిండియాలో కార్మికులకు లేని ఐటీ నిబంధనలను సింగరేణి కార్మికులకు వర్తింపజేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.