హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడికి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

MHBD: డోర్నకల్ మండలంలోని ఇందిరానగర్‌కి చెందిన గంజి భద్రయ్య ఈరోజు ఉదయం మరణించారు. విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్, ఉపాధ్యక్షులు ఎల్లావుల హరికృష్ణలు మధ్యాహ్నం వారి నివాసానికి వెళ్లి, మృతదేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.