MNCL: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధన కోసం ఈ నెల 27న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీజీ జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 51 శాతం తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ఒకేసారి విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
27న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా


