SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ డాక్టర్ మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రతి ఇంటికీ ఒక్కో మొక్కను పంపిణీ చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మొక్కలను పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకుని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
కొదురుపాకలో ఇంటింటికీ మొక్కల పంపిణీ


