హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుకు ఉరేసుకుని యువకుడి మృతి

PDPL: గోదావరిఖని టూ టౌన్ పరిధి అల్లూరు గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు సింగరేణి RG-2లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు రాజ్ కుమార్‌గా గుర్తించారు. బుధవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.