హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోతె చెరువులో మొసలి కలకలం

JGL: జగిత్యాల పట్టణ శివారులోని మోతె చెరువులో బుధవారం మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఉదయం ఓ వ్యక్తి కుక్కతో వాకింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో మొసలిని చూసిన కుక్క గట్టిగా మొరగడంతో అప్రమత్తమైన యజమాని నీటిలో మొసలిని గమనించాడు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.