హైదరాబాద్: 28°C
తెలంగాణ

29న పౌరహక్కుల దినోత్సవం

KNR: శంకరపట్నం మండలం కరీంపేటలో ఈనెల 29న పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కే.సురేఖ తెలిపారు. పౌరుల హక్కులు, అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, దళిత నాయకులు, అంబేద్కర్‌వాదులు, గ్రామస్థులు హాజరుకావాలని కోరారు.