హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఎస్సైని సన్మానించిన రెడ్డి సంఘం

SRCL: వేములవాడ రూరల్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ నూతన ఎస్సై ప్రశాంత్ రెడ్డికి బుధవారం ఘనంగా సన్మానం చేశారు. మండల అధ్యక్షుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరెడ్ల రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ సంయుక్త కార్యదర్శి దొంతి నారాయణరెడ్డి, క్యాషియర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.