హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు నిధి ఆప్కే నికట్ 2.0 సదస్సులు'

NZB: ఈపీఎఫ్ చందాదారులు, పెన్షనర్లు, యజమానుల సమస్యల పరిష్కారానికి రేపు ‘నిధి ఆప్కే నికట్ 2.0’ సదస్సులు నిర్వహించనున్నట్లు పీఎఫ్ కమిషనర్ బి. రాహుల్ కుమార్ తెలిపారు. బోర్గావ్‌లోని సాహితి విద్యానికేతన్, ఎల్లారెడ్డిలోని జీవదాన్ హైస్కూల్‌లో సదస్సులు జరుగుతాయని చెప్పారు. సరైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.