BHPL: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. జానపద కళలు ప్రజల్లో చైతన్యం, ఆనందాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. నిరుపేద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
జానపద కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తాం : MLA


