హైదరాబాద్: 28°C
వార్తలు

జలమయమైన రోడ్లు.. కారుపై ఉద్యోగి వర్క్

హర్యాన రాష్ట్రం గుర్గావ్‌లో భారీ వర్షాలకు రోడ్లు జలమయమై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడటంతో.. మరో దారి లేక ఓ ఉద్యోగి తన కారుపైనే కూర్చొని ల్యాప్‌టాప్‌లో పని చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అతనికి 'ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ ఇవ్వాలంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.