హైదరాబాద్: 28°C
వార్తలు

‘ముస్లిం ఎంపీల సంఖ్య పెరగాలి’

ఇతర వర్గాలకు ఉన్నట్లే ముస్లింలకు కూడా సొంత నాయకత్వం ఎందుకు ఉండకూడదని MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 18 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు పార్లమెంట్‌లో కేవలం 24 మంది ఎంపీలు ఉండటం దారుణమన్నారు. వారి తరఫున మాట్లాడేవారే కరవయ్యారని, వందేమాతరం అంశంపై మాట్లాడలేని దుస్థితి ఉందన్నారు. ముస్లిం ఎంపీల సంఖ్య పెరిగితేనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మరింత బలపడుతాయని అభిప్రాయపడ్డారు.