హైదరాబాద్: 28°C
వార్తలు

10 వేల నకిలీ మద్యం సీసాలు స్వాధీనం

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి 13 మంది మరణించిన ఘటన మరువకముందే, కచ్ జిల్లాలో మరో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. ప్రముఖ విదేశీ మద్యం బ్రాండ్‌కు చెందిన దాదాపు 10,000 ఖాళీ, నింపిన సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో మద్యం తయారీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.