హైదరాబాద్: 28°C
వార్తలు

ఉరుములతో భూగర్భాన్ని శోధించొచ్చు!

శరీరానికి ఎక్స్‌రే వాడినట్లే, భూఅంతర్భాగాన్ని శోధించడానికి శాస్త్రవేత్తలు ఆకాశం నుంచి వచ్చే ఉరుములను సరికొత్త సాధనంగా మలిచారు. దీనిద్వారా భూగర్భజలాల కదలికలు, పర్యావరణ కాలుష్యం, భూమి కుంగిపోవడం వల్ల ఏర్పడే సింక్‌హోల్స్‌ను అత్యంత చౌకగా గుర్తించవచ్చు. అలాగే విమానాల వేగవంతమైన ప్రయాణ ధ్వని తరంగాలతోనూ భూమి లోపలి పరిస్థితులను పసిగట్టవచ్చని సైంటిస్టులు నిరూపించారు.