హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: రాబోయే 14 రోజులు భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. ఇన్‌శాట్ శాటిలైట్ చిత్రాల్లో ఆకాశం దట్టమైన మేఘాలతో కనిపిస్తోందని, దీని ప్రభావంతో రాబోయే 14 రోజులపాటు దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఢిల్లీ-NCR ప్రాంతంలోనూ చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి.