హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత రాష్ట్రపతికి కృతజ్ఞతలు’

ఉక్రెయిన్ 35వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన శుభాకాంక్షలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో యుద్ధానికి గౌరవప్రదమైన ముగింపు పలకడమే ఉక్రెయిన్ ప్రజల ప్రధాన కల అని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత్‌తో పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంభాషణను మరింత బలోపేతం చేయడానికి తమ దేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.