హైదరాబాద్: 28°C
వార్తలు

‘రాజ్యాంగ సూత్రాలు అందరికీ సమానంగా వర్తించాలి’

స్కూళ్లలో హిజాబ్ ధరించేందుకు అనుమతి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును విశ్వ హిందూ రక్షా పరిషత్(VHRP) జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ స్వాగతించారు. స్కూల్ యూనిఫాం.. సమానత్వాన్ని, క్రమశిక్షణను సూచిస్తుందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు మతపరమైన గుర్తింపులను చాటుకునే వేదికలు కాకూడదని, రాజ్యాంగ సూత్రాలు అన్ని మతాల విద్యార్థులకు సమానంగా వర్తించాలని స్పష్టం చేశారు.