భారీ వర్షాలు ఒడిశాను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 6 జిల్లాల్లో దాదాపు లక్ష మందిపై వరద ప్రభావం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపడా, నవరంగ్‌పూర్, కోరాపుట్, కేందుఝర్ జిల్లాల్లో వరదలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వార్తలు
ఒడిశాలో భారీ వర్షాలు.. ప్రజల తీవ్ర ఇబ్బందులు


