హైదరాబాద్: 28°C
వార్తలు

'నాన్‌వెజ్‌ టీ' తాగుతున్నారా?: హైకోర్టు

ఫుడ్ సేఫ్టీ పాటించని కారణంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని 5 రెస్టారెంట్ల లైసెన్సులను FDA సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ MCA వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు తిరుగుతున్నాయని.. ఆటగాళ్లు 'నాన్‌వెజ్‌ టీ' తాగుతున్నారని వారికి తెలుసా అని బాంబే హైకోర్టు సరదాగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.