హైదరాబాద్: 28°C
వార్తలు

స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు: ఐసీఎంఆర్

దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు పెరగడంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ స్పందించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు పరిశుభ్రతను పాటించాలని కోరారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.