తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 365BB అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపింది. బుట్టాయగూడెం-LSD పేట, పట్టిసీమ- కొవ్వూరు మధ్య 45.09 కిలోమీటర్లతో రహదారి అభివృద్ధి కోసం రూ.840.41 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్, పరిసర గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు.
వార్తలు
రూ.840 కోట్లతో 365 BB హైవే అభివృద్ధి: గడ్కరీ


