హైదరాబాద్: 28°C
వార్తలు

రీ-ఎవాల్యూయేషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

12వ తరగతి జవాబు పత్రాల పునఃసమీక్ష కోసం CBSE పోర్టల్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీని కోసం ఇప్పటికే విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు చెప్పింది. విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని.. మరో అవకాశం ఎందుకు ఇవ్వాలని నిలదీసింది. బస్సు ఉన్నప్పుడు ఎక్కకుండా..దానిని మిస్ చేసుకుంటే ఏం చేస్తారని పేర్కొంది.