హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే ప్రాజెక్టుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: మోదీ

రైల్వే, రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులను వేగంతో నిర్మించడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులకు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ డేటాలో ఏఐని వినియోగించాలని చెప్పారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. డిజిటల్ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.