హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘లోకమాత అహిల్యాభాయి మాతృశక్తి యోజన’కు యోగి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర రవాణా శాఖ బస్సుల్లో ఆధార్ లేదా ఓటర్ ఐడీ చూపించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దీనివల్ల సుమారు కోటి మందికి లబ్ధి చేకూరనుంది.