హైదరాబాద్: 28°C
వార్తలు

అవయవదానంతో మరో ముగ్గురికి పునర్జన్మ

RR: అంకిరెడ్డిపల్లి, కీసర మండలానికి చెందిన 18 ఏళ్ల విద్యార్థి పండుగ బన్నీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. పుట్టెడు శోకంలోనూ బన్నీ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వారి నిర్ణయంతో మరో ముగ్గురికి ప్రాణదానం లభించనుంది. అవయవదానం ద్వారా కుటుంబం గొప్ప మానవత్వాన్ని చాటుకుంది.