హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

TG: భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్న ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద 15.10 అడుగులు ప్రవహిస్తున్న గోదావరి, ఇవాళ ఉదయం 8 గంటలకు 20.70 అడుగులకు పెరిగింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో 2 గేట్లు ఎత్తి 27 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.