హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రోన్లను కూల్చే సరికొత్త ఆయుధం!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) దేశీయ శక్తివంతమైన మైక్రోవేవ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ప్రొటోటైప్‌ను సిద్ధం చేసింది. శత్రువుల డ్రోన్ సమూహాలు, మిస్సైళ్లను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలతో నిర్వీర్యం చేసే ఈ నాన్-కైనెటిక్ ఆయుధం త్వరలో ట్రయల్స్‌కు వెళ్లనుంది. DRDOతో కలిసి అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక వ్యవస్థ రక్షణ రంగంలో భారత్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.