BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి మచ్చకుంట వరకు నూతనంగా నిర్మించిన CC రోడ్డుపై విద్యుత్ స్తంభాలు ఉండటంతో ప్రమాద భయం నెలకొందని వాహనదారులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
రహదారిపై కరెంటు స్తంభాలు.. భయాందోళనలో ప్రజలు


