హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం..

BDK: ఎగువన కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. సోమవారం ఉదయం 15.10 అడుగులకు ఉన్న గోదావరి నీటిమట్టం, మంగళవారం ఉదయం గోదావరి నీటిమట్టం 20.60 అడుగులకు చేరింది. అటు 1,91,578 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.