BHPL: గోరికొత్తపల్లి మండలంలోని రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి (AO) సారయ్య సూచించారు. ఇవాళ ఓ సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు కంది, పెసర, మినుము, జొన్న వంటి పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే తక్కువ నీరు, పెట్టుబడితో మంచి దిగుబడులు పొందవచ్చన్నారు.
తెలంగాణ
VIDEO: ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి: AO


